ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్..ఫ్రీగా ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్..ఈ తేదీల్లోనే స్పెషల్ క్యాంపులు!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది

By -  Knakam Karthik
Published on : 9 April 2026 10:42 AM IST

Andrapradesh,  AadhaarUpdate, StudentWelfare, SpecialCamps, BiometricUpdate

ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్..ఫ్రీగా ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్..ఈ తేదీల్లోనే స్పెషల్ క్యాంపులు!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేయనుంది. 'స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డులు' మరియు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

ఈ ప్రక్రియను రెండు విడతల్లో నిర్వహించనున్నారు. మొదటి విడత ఏప్రిల్ 15 నుండి 18 వరకు, రెండో విడత ఏప్రిల్ 21 నుండి 24 వరకు కొనసాగుతుంది. విద్యార్థులు తమ బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేసుకోకపోతే ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌లు, ఇతర సంక్షేమ పథకాలు పొందడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 12.09 లక్షల మంది విద్యార్థులు తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉందని అధికారులు గుర్తించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

Next Story