వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

AP Govt Says Good News For Volunteers. ఆంధ్రప్రదేశ్ లో ఉత్తమ పనితీరు కనబరిస్తున్న వాలంటీర్లను ఉగాది రోజున సత్కరించనున్నారు. ఈ సత్కార కార్యక్రమానికి సంబంధించి నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.

By Medi Samrat  Published on  11 April 2021 6:49 AM GMT
CM Jagan

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చింది. అయితే కొద్దిరోజుల కిందట వాలంటీర్లు తమకు వేతనాలను పెంచాలంటూ రోడ్డెక్కారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారికి ఓ లేఖ రాసి.. సేవ చేయాలనే ఉద్దేశ్యం ఉన్న వారికే గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థలో భాగస్వామ్యులను చేశామని చెప్పుకొచ్చారు. సత్కారాలు ఉంటాయని ప్రకటించారు కూడా..! తాజాగా అందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.

ఉత్తమ పనితీరు కనబరిస్తున్న వాలంటీర్లను ఉగాది రోజున సత్కరించనున్నారు. ఈ సత్కార కార్యక్రమానికి సంబంధించి నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. వాలంటీర్లను సత్కరించడం సహా ఇతర అవసరాలకు గానూ రూ.261 కోట్ల విడుదలచేస్తూ ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు జారీచేశారు. సేవా వజ్ర, సేవా రత్న, సేవామిత్రల పేరిట విశిష్ట సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లకు నగదు ప్రోత్సాహకాలను అందజేయనున్నారు. ఉగాది రోజున ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. సేవా వజ్రకు రూ.30 వేలు, సేవారత్నకు రూ.20 వేలు, సేవా మిత్రకు రూ.10 వేల నగదు పురస్కారం, శాలువాతో గౌరవిస్తారు. మూడు కేటగిరీల్లో మొత్తం 2,22,900 మంది గ్రామ, వార్డు వాలంటీర్లను అవార్డులతో సత్కరించాలని నిర్ణయించారు. ఉగాది నుంచి ప్రతి జిల్లాలో రోజూ ఒక నియోజవర్గంలో వాలంటీర్లకు అవార్డులు, సత్కార కార్యక్రమాలను నిర్వహిస్తారు.

ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఏడాదికిపైగా సేవలందించినవారికి.. మొదటి కేటగిరీలో 2,18,115 మంది వాలంటీర్లకు 'సేవా మిత్ర' అవార్డు అందజేస్తారు. రెండో కేటగిరీలో 4,000 మంది వాలంటీర్లకు 'సేవా రత్న'అవార్డు ఇస్తారు. మూడో కేటగిరీలో 875 మంది వాలంటీర్లకు 'సేవా వజ్ర'అవార్డు ఇస్తారు.


Next Story