కొవిడ్ రెండోదశను ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున నియామకాలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేర‌కు కొవిడ్ ఆసుపత్రులలో నియామకాల‌కు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. స్పెషలిస్టులు , మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది నియామ‌కాల‌కై వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీచేశారు. కొవిడ్ తో బాధపడుతున్న పేషెంట్లకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్టు లు, స్టాఫ్ నర్సులు రంగంలోకి దిగనున్నారు.

ఈ మేర‌కు 1170 స్పెషలిస్టులు , 1170 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు, 2 వేల మంది స్టాఫ్ నర్సులు, 300 మంది అనస్థీషియా టెక్నీషియన్లు, 300 మంది ఎఫ్ఎన్‌వోలు, 300 మంది ఎమ్మెన్వోలు, 300 మంది స్వీపర్ల నియామకానికి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. వీరంద‌రినీ ఆరు నెలల కాలపరిమితి కి గాను కాంట్రాక్టు పద్ధతిలో నియామకం చేప‌ట్ట‌నున్నారు. కొవిడ్ ఆసుపత్రులలో యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేప‌ట్టి తగు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


సామ్రాట్

Next Story