గుంటూరు జిల్లా సంగం డెయిరీ విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. డెయిరీ యాజమాన్యాన్ని.. గుంటూరు జిల్లా పాల ఉత్పత్తి దారుల సహకార సంఘానికి బదిలీ చేశారు. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసంది. సంగం డెయిరీ రోజువారీ కార్యకలపాల బాధ్యత తెనాలి సబ్ కలెక్టర్‌కు అప్పగించారు. డెయిరీ రోజువారీ కార్యకలాపాలు ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతోనే జీవో విడుదల చేశామని ప్రభుత్వం చెబుతోంది.

సంగం డెయిరీని గుంటూరు పాల ఉత్పత్తిదారుల సహకారం సంఘం పరిధిలోకి తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకుంది. జీవో 515ని రద్దు చేసింది. సంగం డెయిరీని ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పరిధిలోకి తెస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. డెయిరీ యాజమాన్యాన్ని ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు బదిలీ చేసింది. గతంలో ఈ బాధ్యతను గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేసింది. డెయిరీ రోజువారీ కార్యకలాపాలు నిర్వగహించే బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ కు అప్పగించడంతో సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ డెయిరీకి చేరుకున్నారు. డెయిరీ రోజువారీ కార్యకలాపాలను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

డెయరీ వ్యవహారంలో ప్రభుత్వం తీరును సవాల్ చేస్తూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. ఓ వైపు పిటిషన్ కోర్టులో విచారణలో ఉండగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. సంగం డెయిరీలో భారీగా అవినీతి జరిగిందని వేల కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయంటూ ఏసీబీ అధికారులు డెయిరీలో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. డైరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.


సామ్రాట్

Next Story