ఏపీ పెన్షన్‌ లబ్ధిదారులకు శుభవార్త

AP Govt key decision on YSR Pension kanuka. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని పెన్షన్‌ లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది.

By అంజి  Published on  26 Sep 2022 6:50 AM GMT
ఏపీ పెన్షన్‌ లబ్ధిదారులకు శుభవార్త

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని పెన్షన్‌ లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది. సొంత రాష్ట్రంలోనే పెన్షన్‌ను ఒకచోటి నుంచి మరో చోటికి మార్చుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. తాజా నిర్ణయం ప్రకారం.. లబ్ధిదారులు తమ నివాసాన్ని ఒకచోట నుంచి మరోచోటికి మార్చే సమయంలో ఆ వివరాలతో సంబంధిత గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.

సచివాలయంలోనే ఈ వెసులుబాటు కల్పించారు. రాష్ట్రంలో నిబంధనల ప్రకారం.. అర్హులు లేని వారికి కూడా కొత్త పింఛన్లు మంజూరు చేసే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనర్హులకు పింఛన్ మంజూరైతే మంజూరైన వారి నుంచి డబ్బులు రికవరీ చేస్తామన్నారు. అలాగే పింఛను సొమ్మును పక్కదారి పట్టించి, మిగిలిన సొమ్మును తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమచేయని సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు.

Next Story