వేసవి సెలవులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
AP Govt Key decision on summer holidays.కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం చాలా ఆలస్యంగా ప్రారంభమైంది కాబట్టి వేసవి సెలవులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.
By తోట వంశీ కుమార్ Published on 18 Jan 2021 10:11 AM IST
కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి విద్యార్థులకు నేటి నుంచి రెండు పూటలా తరగులు జరగనున్నాయి. వీరికోసం ప్రత్యేకంగా 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ విద్యాసంవత్సరం చాలా ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ కాలేజీ విద్యార్థులకు వేసవి సెలవులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా పదో తరగతి విద్యార్థులకు ఆదివారం క్లాసులు నిర్వహించనున్నట్లు తెలిపింది.
కొవిడ్ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు పాటించేలా విద్యాశాఖ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 10వ తరగతి విద్యార్థులకు రోజుకు 8 పీరియడ్లు చొప్పున నిర్వహించనున్నారు. క్లాసులు ఉదయం 8.45 ప్రారంభమై సాయంత్రం 4.20గంటల వరకు కొనసాగనున్నాయి. జాతీయ, పండుగలు మినహా ఆదివారాల్లో కూడా తరగతులు నిర్వహించనున్నారు. ఆదివారం ఒక పూట ఒక సబ్జెక్టులో మాత్రమే తరగతులు జరుగుతాయి. అన్ని పాఠశాలల్లో సోమవారం నుంచి ఈ ప్రణాళికను అమలు చేయాలని డీఈవో సుబ్బారావు ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలలను ఈ విద్యాసంవత్సరానికి ప్రారంభించాలా? వద్దా? అన్న అంశంపై విద్యాశాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాగా, టీచర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బదిలీలను సంక్రాంతి సెలవుల్లో విద్యాశాఖ పూర్తిచేసింది. దాదాపు 76 వేల మంది టీచర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో సోమవారం నుంచి స్కూళ్లు కొందరు కొత్త టీచర్లతో ప్రారంభం కానున్నాయి.
ఇక ఇవాళ్టి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభించనుంది విద్యాశాఖ. సిలబస్ పూర్తి చేయడం, పరీక్షలు నిర్వహించేందుకుగాను ఏపీలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 31 వరకూ తరగతులు జరుగుతాయని.. రెండో శనివారాలు కూడా కాలేజీలు కొనసాగుతాయని తెలిపింది. కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు