రెండో డోసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం
AP Govt key decision on second dose vaccine.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా టీకా రెండు డోసుల మధ్య వ్యవధి
By తోట వంశీ కుమార్ Published on 13 Jun 2021 6:54 AM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా టీకా రెండు డోసుల మధ్య వ్యవధి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, ఉద్యోగులు కొవిషీల్డ్ తొలి డోసు తీసుకున్న 28 రోజుల తరువాత రెండో డోసు పొందవచ్చని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కేంద్రం తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం కొవిషీల్డ్ రెండో డోసును 84 రోజుల తర్వాత పొందాలి. అయితే.. విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. శనివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో 6,952 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,03,074కి చేరింది. నిన్న 11,577 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 16,99,775కి పెరిగింది. కోవిడ్ వల్ల ప్రకాశం లో పదకొండు మంది, చిత్తూర్ లో తొమ్మి ది, తూర్పు గోదావరి లో ఆరుగురు, అనంతపూర్ లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు, విశాఖపట్నం లో ఐదుగురు, శ్రీకాకుళం లో నలుగురు, పశ్చిమ గోదావరి లో నలుగురు, కర్నూల్ లో ముగ్గురు, గుంటూరు లో ఇద్దరు, విజయనగరం లో ఇద్దరు, వైఎస్ఆర్ కడప లో ఒక్కరు, నెల్లూరు లో ఒక్కరు చొప్పున మొత్తం 58 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11,882కి చేరింది. ఇక రాష్ట్రంలో 91,417 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,03,48,106 సాంపిల్స్ ని పరీక్షించారు.