ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలో పదోన్నతులు..!

AP Govt key decision on APSRTC employees promotions.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌(ఏపీఎస్ఆర్టీసీ)

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Sep 2021 6:37 AM GMT
ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలో పదోన్నతులు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌(ఏపీఎస్ఆర్టీసీ) ఉద్యోగుల‌కు ఏపీ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. త్వ‌ర‌లో ఉద్యోగుల‌కు ప‌దోన్న‌తులు క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. వెయ్యి మంది ఉద్యోగుల‌కు ప్ర‌మోష‌న్ ల‌భించ‌నున్నాయి. అధికారుల స్థాయిలో త‌క్కువ‌గానూ.. ఉద్యోగులు, కార్మికుల స్థాయిలో ఎక్కువ‌గానూ ప‌దోన్న‌తులు ద‌క్క‌నున్నాయి.

మెకానిక్‌లు, జూనియర్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, అసిస్టెంట్‌ డిపో మేనేజర్లు, కంట్రోలర్లు, గ్యారేజ్‌ సూపర్‌వైజర్లు, ట్రాఫిక్‌ సూపర్‌వైజర్లు తదితర ఉద్యోగులు ఎక్కువ మందికి ప్రయోజనం కలిగే విధంగా పదోన్నతుల ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యం సూత్రప్రాయంగా ఆమోదించింది. ప్ర‌మోష‌న్ల‌తో ప్ర‌తి ఒక్క‌రికీ ఒక ర్యాంకు పెర‌గ‌నుంది. ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేసిన త‌రువాత తొలిసారి ప‌దోన్న‌త‌లు క‌ల్పించ‌నుండ‌డంతో ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఈ నెల చివ‌రి నాటికి పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు తుది కసరత్తు ముమ్మరం చేశారు.

Next Story
Share it