AP: వైద్యారోగ్య శాఖలో బదిలీలకు.. సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖల బదిలీలకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే చోట రెండేళ్లుగా పనిచేస్తున్న

By అంజి  Published on  25 May 2023 12:43 PM IST
AP  govt, Medical and Health Department, AP news

AP: వైద్యారోగ్య శాఖలో బదిలీలకు.. సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖల బదిలీలకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే చోట రెండేళ్లుగా పనిచేస్తున్న సిబ్బందికి, ఐదేళ్ల సర్వీసు తర్వాత లొకేషన్‌ మారాలనుకునే సిబ్బందికి బదిలీలు వర్తిస్తాయి. 30 శాతానికి మించి బదిలీలు జరగవని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ప్రజారోగ్య శాఖ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ బదిలీలకు సంబంధించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటారు. ఇంతకుముందు జరిగిన సాధారణ బదిలీల్లో ఐదేళ్ల నుంచి ఒకే చోట పని చేస్తున్న వారు తప్పనిసరి విధానంలో ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లేవారు. వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి బదిలీలకు సంబంధించి ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సహాయక నర్సులు, మిడ్‌వైవ్‌లు (ఏఎన్‌ఎం), మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్లు (ఎంపీహెచ్‌ఏ)గా పనిచేస్తున్న మహిళా సిబ్బందికి పరస్పర బదిలీల ద్వారా ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. గిరిజన ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో ఇబ్బందులు తలెత్తకుండా బదిలీలు జరగనున్నాయి. జూన్ 24 నుంచి బదిలీలపై నిషేధం మళ్లీ అమల్లోకి రానుంది.

Next Story