ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆస్తుల జప్తునకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆస్తుల జప్తునకు ఏసీబీ ప్రత్యేక కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేయనుంది. మద్యం అక్రమ ఆదాయంతో ఆస్తులు కొనుగోలు చేసినట్టు సీఐడీ అభియోగాలు మోపింది. దాదాపు 11 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులతో పాటు మూడు కోట్ల రూపాయల బ్యాంక్ అకౌంట్ కూడా జప్తునకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.