ఏపీలో మరోసారి కర్ఫ్యూ పొడిగింపు

AP Govt extends night curfew till September 30th.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. ఈ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Sept 2021 8:52 AM IST
ఏపీలో మరోసారి కర్ఫ్యూ పొడిగింపు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా క‌ర్ఫ్యూ ఆంక్ష‌ల్ని పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌తి రోజు రాత్రి 11 నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని తెలిపింది. నిబంధ‌న‌ల‌ను ఎవ‌రైనా ఉల్లంఘిస్తే క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ముఖ్య కార్య‌ద‌ర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇక వివాహాల‌కు 150 మందికి మాత్ర‌మే అనుమ‌తి ఉంది. తెల్ల‌వారుజామున పెళ్లిళ్లు ఉంటే.. ముంద‌స్తు అనుమ‌తి త‌ప్పనిస‌రి.

ఇక రాష్ట్రంలో క‌రోనా విజృంభ‌న కొనసాగుతూనే ఉంది. శుక్ర‌వారం సాయంత్రం ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన బులిటెన్ ప్రకారం 1393 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 8 మంది మ‌ర‌ణించారు. అదే స‌మ‌యంలో 1296 మంది క‌రోనా నుంచి కోలుకున్న‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,36,179 కు చేరింది. ఇందులో 20,07,330 మంది కోలుకున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 14,797 కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,052 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Next Story