సీబీఏఎస్ పరీక్ష రద్దు..!
AP Govt cancelled CBAS exam.గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊరట లభించింది. వీరి ప్రొబేషనరీని
By తోట వంశీ కుమార్ Published on
3 Aug 2021 5:28 AM GMT

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊరట లభించింది. వీరి ప్రొబేషనరీని ఖరారు చేసేందుకు నిర్వహించే రెండు పరీక్షల్లో ఒకటైన సీబీఏఎస్‌ను రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం తమకు చెప్పారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. సచివాలయ ఉద్యోగులకు సీబీఏఎస్ పరీక్షను తొలగించాలని కోరుతూ అజేయ కల్లంను సోమవారం కలిసినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. తమ విజ్ఞప్తిపై ఆయన స్పందించి సీఎంను సంప్రదించారని తెలిపారు. ఈ సందర్భంగా పరీక్షను రద్దు చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు.
Next Story