26 జిల్లాల‌కు క‌లెక్ట‌ర్లు, ఎస్పీల నియామ‌కం

AP govt appoints district collectors to 26 districts.ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 April 2022 11:01 AM IST
26 జిల్లాల‌కు క‌లెక్ట‌ర్లు, ఎస్పీల నియామ‌కం

ఏపీ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ఫైనల్‌ డ్రాఫ్ట్‌‌కు ఇప్పటికే ఆమోదించిన ఏపీ ప్రభుత్వం తాజాగా 26 జిల్లాలకు కలెక్టర్లు, సంయుక్త క‌లెక్ట‌ర్లను, ఎస్పీల‌ను నియ‌మించింది. ప్ర‌స్తుతం ఉన్న 13 జిల్లాల క‌లెక్ట‌ర్ల‌లో న‌లుగురు త‌ప్ప మిగ‌తా తొమ్మిది మందిని వారు ప‌ని చేస్తున్న చోటే క‌లెక్ట‌ర్లుగా కొన‌సాగించింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం శ‌నివారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేసింది.

26 జిల్లాల క‌లెక్ట‌ర్లు వీరే..

- విజయనగరం జిల్లా కలెక్టర్‌గా సూర్యకుమారి కొనసాగింపు

- శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్‌ బాలాజీరావు కొనసాగింపు

- విశాఖ జిల్లా కలెక్టర్‌గా మల్లికార్జున కొనసాగింపు

- మన్యం జిల్లా కలెక్టర్‌గా నిశాంత్ కుమార్‌ నియామకం

- అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా సుమిత్‌ కుమార్‌

- అనకాపల్లి జిల్లా కలెక్టర్‌గా రవి సుభాష్‌ నియామకం

- కాకినాడ జిల్లా కలెక్టర్‌గా కృతికా శుక్లా నియామకం

- తూర్పుగోదావ‌రి జిల్లా కలెక్టర్‌గా మాధవీలత నియామకం

- కోనసీమ జిల్లా కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా నియామకం

- ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి నియామకం

- ఏలూరు జిల్లా కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేశ్‌ నియామకం

- కృష్ణా జిల్లా కలెక్టర్‌గా రంజిత్‌ బాషా నియామకం

- ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా ఎస్‌.దిల్లీరావు నియామకం

- గుంటూరు జిల్లా కలెక్టర్‌గా వేణుగోపాల్‌రెడ్డి నియామకం

- పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శివ శంకర్‌ నియామకం

- బాపట్ల జిల్లా కలెక్టర్‌గా విజయ నియామకం

- ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా దినేశ్‌ కుమార్ నియామకం

- నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా చక్రధర్‌ బాబు

- శ్రీబాలాజీ జిల్లా కలెక్టర్‌గా వెంకటరమణారెడ్డి

- చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా హరినారాయణ

- అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా శ్రీ గిరీష

- కడప కలెక్టర్‌గా విజయరామరాజు

- శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌గా పి.బసంత్‌ కుమార్‌

- అనంతపురం కలెక్టర్‌గా ఎస్‌.నాగలక్ష్మి

- నంద్యాల కలెక్టర్‌గా మనజీర్‌ జిలాని శామూన్‌

- కర్నూలు జిల్లా కలెక్టర్‌గా కోటేశ్వరరావు

ఎస్పీల వివరాలు ఇవే..

- అనకాపల్లి ఎస్పీగా గౌతమి సాలి

- అల్లూరి సీతారామరాజు ఎస్పీగా సతీశ్‌కుమార్

- శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా జి.ఆర్‌.రాధిక

- విజయనగరం ఎస్పీగా ఎం.దీపిక కొనసాగింపు

- పార్వతీపురం ఎస్పీగా వాసన విద్య సాగర్‌ నాయుడు

- కాకినాడ ఎస్పీగా రవీంద్రనాథ్‌ బాబు

- కోనసీమ జిల్లా ఎస్పీగా కె.ఎస్‌.ఎస్‌.వి. సుబ్బారెడ్డి

- తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి

- పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా రవిప్రకాశ్‌

- ఏలూరు ఎస్పీగా ఆర్‌.ఎన్‌. అమ్మిరెడ్డి

- కృష్ణా జిల్లా ఎస్పీగా సిద్ధార్థ కౌశల్‌ కొనసాగింపు

- విజయవాడ కమిషనర్‌గా క్రాంతి రాణా టాటా కొనసాగింపు

- గుంటూరు ఆర్బన్‌ ఎస్పీగా కె.ఆరీఫ్‌ హాఫీజ్‌ కొనసాగింపు

- పల్నాడు జిల్లా ఎస్పీగా రవిశంకర్‌రెడ్డి

- బాపట్ల జిల్లా ఎస్పీగా వకుల్‌ జిందాల్‌

- ప్రకాశం జిల్లా ఎస్పీగా మల్లిక గార్గ్‌ కొనసాగింపు

- నెల్లూరు ఎస్పీగా సీహెచ్‌ విజయరావు కొనసాగింపు

- తిరుపతి ఎస్పీగా పరమేశ్వర్‌రెడ్డి

- చిత్తూరు ఎస్పీగా రిశాంత్‌రెడ్డి

- అన్నమయ్య ఎస్పీగా హర్షవర్ధన్‌రాజు

- కడప ఎస్పీగా అన్బూరాజన్‌ కొనసాగింపు

- అనంతపురం ఎస్పీగా ఫకీరప్ప కొనసాగింపు

- శ్రీసత్యసాయి ఎస్పీగా రాజుల్‌ దేవ్‌ సింగ్‌

- కర్నూలు జిల్లా ఎస్పీగా సుధీర్‌కుమార్‌రెడ్డి

- నంద్యాల ఎస్పీగా కె.రఘువీరారెడ్డి

- విశాఖ కమిషనర్‌గా సీహెచ్‌. శ్రీకాంత్


Next Story