అల‌ర్ట్‌.. ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు.. ఉల్లంఘిస్తే రూ.10వేల నుంచి రూ.25 వేలు జరిమానా

AP Government Released new guidelines to control Omicron Variant.క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శ‌ర‌వేగంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Dec 2021 12:30 PM IST
అల‌ర్ట్‌..  ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు.. ఉల్లంఘిస్తే రూ.10వేల నుంచి రూ.25 వేలు జరిమానా

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. క‌రోనా సెకండ్ వేవ్ లో విజృంభించిన డెల్టా వేరియంట్ కంటే దాదాపు ఆరు రెట్ల వేగంతో వ్యాప్తి చెందుతోంది. మ‌న దేశంలో కూడా ఈ కొత్త వేరియంట్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్రాలు కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కేంద్రప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ కొత్త‌వేరియంట్ వ్యాప్తి నివార‌ణ‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌లు కీల‌క మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. కేంద్ర‌ప్ర‌భుత్వం, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాలు(గైడ్ లైన్స్‌)ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది.

మాస్కు లేకుండా బ‌హిరంగ ప్ర‌దేశాల్లో క‌నిపిస్తే రూ.100 జ‌రిమానా విధించ‌నున్నారు. అలాగే మాస్కులేని వారిని దుకాణాల్లో, వాణిజ్య ప్రదేశాల్లో, వ్యాపార సంస్థల ప్రాంగణాల్లోకి అనుమతిస్తే సదరు యాజమాన్యానికి రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు జరిమానా విధించనున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఎవరైనా సరే ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే.. జ‌రిమానాతో పాటు ఆయా వ్యాపార, వాణిజ్య సంస్థలను 2 రోజుల పాటు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్దేశ్య‌పూర్వ‌కంగా ఉల్లంఘ‌ల‌కు పాల్ప‌డితే.. విపత్తు నిర్వహణ, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేయనున్న‌ట్లు వెల్ల‌డించింది. క‌రోనా నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల‌పై 8010968295 నెంబరుకు వాట్సప్ ద్వారా ప్ర‌జ‌లు ఎవ‌రైనా ఫిర్యాదు చేయొచ్చున‌ని ఆ మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొంది.

Next Story