మందుబాబుల‌కు శుభవార్త‌.. తగ్గనున్న మద్యం ధరలు

AP Government reduced liquor rates.మందుబాబుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. మ‌ద్యం ప‌న్ను రేట్ల‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Dec 2021 7:47 AM IST
మందుబాబుల‌కు శుభవార్త‌.. తగ్గనున్న మద్యం ధరలు

మందుబాబుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. మ‌ద్యం ప‌న్ను రేట్ల‌లో మ‌రోమారు మార్పులు చేసింది. ఈ మేర‌కు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యాట్, అదనపు ఎక్సైజు డ్యూటీ ప్రత్యేక మార్జిన్లల్లో హేతుబద్దత కోసం ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యాట్, అదనపు ఎక్సైజు డ్యూటీలో హేతుబద్దత ద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గనున్నాయి.

ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ వెరెటీలపై 5 నుంచి 12 శాతం మేర ధరలు తగ్గే అవకాశం ఉండగా.. ఇతర అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం వరకూ ధరలు త‌గ్గ‌నున్నాయి. రాష్ట్రంలో అక్రమ మద్యం, నాటుసారా తయారీ అరికట్టేందుకే.. ధ‌ర‌ల త‌గ్గింపు నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక వచ్చే వారం నుంచి ప్రముఖ కంపెనీల బ్రాండ్ల మద్యం విక్రయాలు జరుగుతాయ‌న్నారు. ఇక ప్రభుత్వ చర్యల వల్ల రాష్ట్రంలో 37 శాతం వినియోగం త‌గ్గింద‌న్నారు. ఈ ఉత్తర్వులు నేటి నుంచి అమల్లోకి వస్తాయని ఏపీ ప్ర‌భుత్వం తెలిపింది.

Next Story