అమరావతి: రాష్ట్రంలో కొందరు వృద్ధులకు వేలి ముద్రలు అరిగిపోయి పెన్షన్ల పంపిణీ సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాలకు 1,34,450 అత్యాధునిక స్కానర్లను పంపిణీ చేయనుంది. ఇందులో ఉడాయ్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేశారు. ఈ పరికరాల సాయంతో వేలిముద్రల సమస్యకు చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త స్కానర్లతో వృద్ధుల పెన్షన్ల పంపిణీలో ఇబ్బందులు తప్పనున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మొదటి రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దే పెన్షన్ల పంపిణీ చేస్తోంది. అయితే ఒక్కోసారి టెక్నికల్ సమస్య కారణంగా పెన్షన్ల పంపిణీ అక్కడక్కడా ఆలస్యమవుతోంది. సర్వర్ సమస్య ఒకటి అయితే.. పెన్షన్ తీసుకునే వారి వేలిముద్రలు పడకపోవటం మరో సమస్య. ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే గ్రామ, వార్డు సచివాలయాలకు 1,34,450 అత్యాధునిక స్కానర్లను పంపిణీ చేస్తోంది.