అమరావతి: కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో ఇటీవల మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీలో 40 శాతం మార్కులతో దరఖాస్తు చేసుకునేలా ఉత్తర్వులు ఇచ్చింది. బీఈడీకి, టెట్‌కు డిగ్రీలో 40 శాతం మార్కుల అర్హత ఉండగా.. డీఎస్సీకి 45 శాతం పెట్టడంపై అభ్యర్థులు అభ్యంతరం చెప్పిన విషయం తెలిసిందే. దీంతో అభ్యర్థుల వినతుల దృష్ట్యా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది.
జనరల్ అభ్యర్థులకు మాత్రం 50 శాతం మార్కలు ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్, సిలబస్, అప్లికేషన్ లింక్, రాష్ట్ర, జోనల్, జిల్లాల వారీగా పోస్టులు, సబ్జెక్టుల పోస్టులు, రిజర్వేషన్లతో పూర్తిస్థాయిలో ఖాళీలు వంటి పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in/లో ఉన్నాయి. జూన్ 6 నుంచి ప్రారంభమై జులై 6 వరకూ డీఎస్సీ పరీక్షలు జరుగుతాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో వీటిని నిర్వహిస్తారు.