ఏపీ సచివాలయంలో క‌రోనా ఆంక్షలు ఎత్తివేత.. అందరూ రావాల్సిందే

AP Government key order to secretariat higher officers.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్టిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Feb 2022 4:13 PM IST
ఏపీ సచివాలయంలో క‌రోనా ఆంక్షలు ఎత్తివేత.. అందరూ రావాల్సిందే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్టిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏపీ స‌చివాల‌య ప‌రిధిలో కొవిడ్‌ ఆంక్షలు ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులంద‌రూ కార్యాల‌యాల‌కు రావాల‌ని తెలిపింది. ఉన్నతాధికారులు అంద‌రూ ఇక‌పై సచివాలయం నుంచే విధులు నిర్వహించాలని.. సీఎస్‌, మంత్రులు, ప్రభుత్వ సమావేశాలకూ భౌతికంగా హాజరు కావాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.

ఇన్నాళ్లు క‌రోనా కార‌ణంగా కొంత మంది ఉద్యోగులు మాత్ర‌మే కార్యాల‌యాల‌కు రాగా.. మిగిలిన ఉద్యోగులు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ విధానంలో ప‌ని చేస్తున్నారు. ఇప్పుడు మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌ట్టిన నేప‌థ్యంలో ఉన్నతాధికారులు అంద‌రూ ఇక‌పై సచివాలయం నుంచే విధులు నిర్వహించాలని సీఎస్ స‌మీర్ శ‌ర్మ ఆదేశాలు జారీ చేశారు. బయోమెట్రిక్, ఫేస్‌ రికగ్నిషన్ ద్వారా హాజ‌రు న‌మోదు చేయాల‌న్నారు. కొవిడ్‌ తగ్గుముఖం పట్టడం వల్ల అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా ఏపీలో రాష్ట్రంలో నిన్న 528 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 9.470 యాక్టివ్‌ కేసులున్నాయి

Next Story