అమరావతి: గీత కులాలకు మద్యం షాపులను కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇప్పటికే జిల్లాల వారిగా లిస్ట్‌లు సిద్ధం అవగా.. మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబరులో కొత్త మద్యం విధానం తీసుకొచ్చింది. 2016లో చేసిన స్మార్ట్ పల్స్ సర్వేని కులాల జనాభాకు ప్రామాణికంగా చేసి జిల్లాల వారీరగా షాపులు కేటాయించనున్నారు. అత్యధికంగా చిత్తూరుకు షాపులు కేటాయించే ఛాన్స్ ఉంది.
ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11గంటలకు క్యాబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. అయితే ఈ క్యాబినెట్ బెట్టిలో పలు కీలక నిర్ణయాలను తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా వైన్ షాపుల్లో 10% గీత కార్మికులకు కేటాయించటం తదితర అంశాల పైన క్యాబినెట్ భేటీలో చర్చించనున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం పైన చర్చ జరపనున్నారు.