అమరావతి: రాష్ట్రంలోని ఇమామ్, మౌజామ్‌లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా వారికి కూటమి ప్రభుత్వం గౌరవ వేతనాలను విడుదల చేసింది. 2024 - 25 సంవత్సరానికి గానూ మొత్తం రూ.45 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజామ్‌లకు రూ.5 వేల చొప్పున నెలకు గౌరవ వేతనంగా ప్రభుత్వం ఇస్తోన్న సంగతి తెలిసిందే.
2024 ఏప్రిల్ నుంచి వాటి చెల్లింపును కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని నిధులను విడుదల చేసింది. ఆరు నెలల గౌరవ వేతనం చెల్లింపునకు గాను ప్రభుత్వం ఈ మొత్తాన్ని విడుదల చేసిందని వక్ఫ్‌బోర్డు చైర్మ్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. కాగా ఇమామ్, మౌజమ్‌లకు గౌరవ వేతనాలను గతంలో టీడీపీ ప్రభుత్వమే ప్రారంభించిందన్న విషయం తెలిసిందే. ముస్లింలు హజ్ యాత్రకు వెళ్తే ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా చేస్తోంది.