ఏపీ వైద్య విద్యార్థులకు శుభవార్త.. స్టైఫండ్‌ భారీగా పెంపు

వైద్య విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రస్తుతం వారికి చెల్లిస్తున్న స్టైఫండ్‌ను పెంచుతున్నట్లు వెల్లడించింది.

By అంజి  Published on  10 Aug 2024 8:38 AM IST
AP government, medical students, stipend

ఏపీ వైద్య విద్యార్థులకు శుభవార్త.. స్టైఫండ్‌ భారీగా పెంపు

వైద్య విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రస్తుతం వారికి చెల్లిస్తున్న స్టైఫండ్‌ను పెంచుతున్నట్లు వెల్లడించింది. స్టైఫండ్‌ను 15 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. కాగా దీని ద్వారా విద్యార్థులకు ఎంతోగానో మేలు కలుగుతుంది. సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో ఫస్టియర్‌ విద్యార్థులకు ప్రస్తుతం రూ.70 వేలు ఇస్తుండగా, ఇక పై రూ.80,500 అందిస్తారు.

అలాగే ఎంబీబీఎస్‌ హౌస్‌ సర్జన్లకు ఇచ్చే రూ.22,527లను రూ.25,906కు పెంచారు. అలాగే పీజీ విద్యార్థులకూ స్టైఫండ్‌ పెంచారు. మరో వైపు తల్లికి వందనం పథకం అమలు జరగాల్సి ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పథకం ఎప్పటి నుంచి అమలు అవుతుందని ఎదురు చూస్తున్నారు. తల్లికి వందనం స్కీమ్ కింద ప్రతి బిడ్డకు రూ.15 వేలు చొప్పున అందిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇంట్లో ఇద్దరు పిల్లలు చదువుకుంటూ ఉంటే రూ.30 వేలు.. అదే ముగ్గురు అయితే రూ. 45 వేలు వస్తాయి.

Next Story