ఆంధ్రప్రదేశ్‌లో కల్లు గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు దరఖాస్తుల గడువు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 8వ తేదీ వరకు మద్యం షాపులకు అప్లికేషన్ చేసుకునేందుకు ఎక్సైజ్ శాఖ అవకాశం కల్పించింది, ఈ మేరకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 9వ తేదీన దరఖాస్తులు పరిశీలన చేపట్టనున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. 10వ తేదీన ఉదయం 9 గంటలకు దరఖాస్తులు డ్రా తీసి లబ్ధిదారుల వివరాలను జిల్లా కలెక్టర్లు ప్రకటించనున్నారు. అనంతరం మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 340 మద్యం షాపులను కల్లు గీత కార్మికుల కులాలకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.