అమరావతి: పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. జనవరి నెలకు సంబంధించిన సామాజిక భద్రత పెన్షన్లను ఒక రోజు ముందుగానే పంపిణీ చేయనున్నట్టు వెల్లడించింది. డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మొత్తం 63.12 లక్షల పింఛనుదారులకు రూ .2743.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇందుకు సంబంధించిన నగదును డిసెంబర్ 30వ తేదీనే నిర్దేశించిన గ్రామ, సచివాలయ ఉద్యోగులు విత్ డ్రా చేసుకోవాలని సూచించింది.
ఈ మేరకు డీఆర్‌డీఏ పీడీలు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. 1 జనవరి 2026 నూతన సంవత్సరం సందర్బంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు ఒక రోజు ముందుగా అనగా 31 డిసెంబర్ 2025 వ తేదీన అందజేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 63.12 లక్షల పింఛనుదారులకు రూ .2743.99 కోట్లను సచివాలయ సిబ్బంది పింఛనుదారుల ఇంటివద్దనే పంపిణి చేయటం జరుగుతుందని మంత్రి కొండపల్లి తెలిపారు. డిసెంబర్ 31 2025 తేదిన పంపిణి కాకుండా మిగిలిన పెన్షన్‌లను జనవరి 2 2026 న సచివాలయ సిబ్బంది పింఛనుదారుల ఇంటివద్దనే పంపిణి చేయటం జరుగుతుందన్నారు.