గిన్నిస్ రికార్డు సాధించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో ఘనతను సాధించింది.

By Knakam Karthik
Published on : 29 July 2025 1:42 PM IST

Andrapradesh, Coalition Government, MEGA PTM, Minister Nara Lokesh, Guinness record

గిన్నిస్ రికార్డు సాధించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో ఘనతను సాధించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇటీవల పెద్ద ఎత్తున పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. గిన్నిస్ బుక్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ ప్రకారం జులై 10న నిర్వహించిన మెగా పీటీఎంలో మొత్తం 5.34 మిలియన్ల (53.4 లక్షలు) తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్​ఎంసీ) సభ్యులు, ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వారితో సహా మొత్తం 15.2 మిలియన్ల (1.5 కోట్లు) మందితో అతిపెద్ద పేరెంట్-టీచర్ మీటింగ్ జరిగింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ వేదికగా తెలిపారు.

ఈ సందర్భంగా నారా లోకేశ్ ఇలా రాసుకొచ్చారు..ఆంధ్రప్రదేశ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద పేరెంట్-టీచర్ మీటింగ్ (MEGA PTM) నిర్వహించి గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పడం పట్ల చాలా ఆనందంగా ఉంది. ఈ గిన్నిస్ రికార్డ్ ఉపాధ్యాయుల‌కు అంకితం చేస్తున్నాను. గిన్నిస్ బుక్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ ప్రకారం మెగా పీటీఎంలో 53.4 లక్షల మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వారితో సహా మొత్తం 1.5 కోట్ల మంది పీటీఎమ్ లో భాగ‌మ‌య్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలను తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ రికార్డు గొప్ప ప్రోత్సాహంగా నిలిచింది. గిన్నీస్ రికార్డు సాధ‌న‌లో భాగ‌మైన‌ ప్రతిఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..అని ట్వీట్ చేశారు.

Next Story