మాండౌస్ తుపాను బాధితులకు.. ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం

AP governament issues orders releasing financial assistance to Mandous Cyclone victims. మాండౌస్ తుఫాను బాధితులకు ఆర్థిక సహాయం విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు

By అంజి  Published on  11 Dec 2022 11:11 AM GMT
మాండౌస్ తుపాను బాధితులకు.. ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం

మాండౌస్ తుఫాను బాధితులకు ఆర్థిక సహాయం విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.2 వేల వరకు ఆర్థిక సాయం ప్రకటించారు. పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి వెళ్లేటప్పుడే ఈ ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలైన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లోని బాధితులకు ఆర్థిక సాయం అందించనున్నారు. కాగా, రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో మండు తుపాను తీవ్ర ప్రభావం చూపింది.

నెల్లూరు, తిరుపతి జిల్లాలు, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మిగతా జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల చెట్లు విరిగిపడడంతో పాటు వాగులు, వంకలు పొంగి పొర్లడంతో ఆయా ప్రాంతాల్లోని పట్టణాలు, గ్రామాల్లో మోకాళ్లలోతు వర్షపు నీరు ప్రవహిస్తోంది. శుక్రవారం రాత్రి తమిళనాడు తీరం దాటిన మాండౌస్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఆదివారం కూడా వర్షాలు కురుస్తూ ప్రస్తుతం అల్పపీడనంగా మారాయి.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమై వాహనాల రాకపోకలను ప్రభావితం చేశాయి. సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా.. పంటలు దెబ్బతిన్నాయి. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వాగులు, సరస్సులు పొంగిపొర్లుతున్నాయి.

Next Story