నాయీ బ్రహ్మణుల కమిషన్‌ పెంపు.. ఉత్తర్వులు జారీ

సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో నాయీ బ్రహ్మణులకు కనీస కమీషన్‌ను రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది.

By అంజి
Published on : 25 April 2025 6:59 AM IST

APnews, Endowment Department, commission, Nai Brahmins

నాయీ బ్రహ్మణుల కమిషన్‌ పెంపు.. ఉత్తర్వులు జారీ 

అమరావతి: సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో నాయీ బ్రహ్మణులకు కనీస కమీషన్‌ను రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది. ఈ మేరకు గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కూటమి సర్కార్‌ ఎలక్షన్‌ టైమ్‌లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుంది. ఎన్నికల సమయంలో నాయీ బ్రహ్మణుల కమీషన్‌ను పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇచ్చిన హామీని అమలు చేసింది. 6ఏ కేటగిరీలోని 44 దేవాలయాల్లో పని చేస్తున్న వారికి వర్తించేలా ఉత్తర్వుల్లో పేర్కొంది.

కనీసం ఆలయాల్లో 100 రోజుల పాటు సేవలు అందించేవారికి ఈ పెంపు వర్తించనుంది. ఏడాదికి రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్లు ఆదాయం వచ్చే ఆలయాలు 6A కేటగిరీలోకి వస్తాయి. ఇటీవల సీఎం చంద్రబాబు దేవాదాయ శాఖపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఈ హామీని అమలు చేయాలని ఆదేశించారు. దీంతో నాయీ బ్రహ్మణులకు కనీస కమీషన్‌ రూ.25 వేలకు పెంచుతూ దేవాదాయశాఖ ఇంఛార్జి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి ఉత్తర్వు ఇచ్చారు.

Next Story