మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పర్యటన

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు

By -  Knakam Karthik
Published on : 25 Jan 2026 12:07 PM IST

Andrapradesh,  Deputy CM Pawan Kalyan, Maharashtra  Visit

మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పర్యటన

అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు. ప్రముఖ సిక్కు గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ ఆత్మార్పణ దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు నాందేడ్ విచ్చేసిన పవన్ కళ్యాణ్‌కు ప్రభుత్వ అతిథిగా మహారాష్ట్ర సర్కార్ స్వాగతం పలికింది.

నాందేడ్ లోని శ్రీ గురు గోవింద్ సింగ్ విమానాశ్రయంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు అశోక్ చవాన్ , ఆయన కుమార్తె భోకార్ శాసన సభ్యురాలు జయ చవాన్, శాసన మండలి సభ్యులు రాజార్ కర్, నాందేడ్ జిల్లా కలెక్టర్ రాహుల్ ఖరడ్లే తదితరులు పవన్ కళ్యాణ్‌కి ఘనంగా స్వాగతం పలికారు. బస దగ్గర నాందేడ్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి అజిత్ సావే, రాజ్యసభ సభ్యులు అజిత్ గోప్ చడే, ఆర్.ఎస్.ఎస్. ప్రముఖులు రాజేంద్ర కోడగే తదితరులు పవన్ కళ్యాణ్‌ను స్వాగతించారు.

Next Story