'వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగలేదే'.. డిప్యూటీ సీఎం పవన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

పిఠాపురం నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ సభ జరిగింది. ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

By అంజి  Published on  1 July 2024 1:30 PM IST
AP Deputy CM, Pawan Kalyan, volunteers, Pithapuram

'వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగలేదే'.. డిప్యూటీ సీఎం పవన్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

పిఠాపురం నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ సభ జరిగింది. ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు లేకుండానే పెన్షన్లను పంపిణీ చేశామని, వాలంటీర్లు లేకపోతే పెన్షన్ల పంపిణీ ఆగలేదని అన్నారు.

''నాడు వలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని ఊదరగొట్టారే.? నేడు వలంటీర్లు లేరు.. పెన్షన్లు ఆగాయా..? రెట్టింపు పెన్షన్‌ను కూడా సచివాలయ ఉద్యోగులు ఇళ్లకు వచ్చి మరీ ఇస్తున్నారు కదా.. గతంలో పెన్షన్ల పంపిణీకి 4-5 రోజులు ఇచ్చేవారు. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం లోగా 100 శాతం పెన్షన్లు ఇస్తాం'' అని పవన్‌ పేర్కొన్నారు. వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలి అనేదానిపై ఆలోచిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పథకాన్ని ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా పింఛను అందజేశారు.

ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వంతో ఏప్రిల్, మే నెలల్లో 33మంది చనిపోయే పరిస్థితిని వైసీపీ తీసుకొచ్చిందని విమర్శించారు. ''సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పించాలని అప్పుడు మేం కోరాం. వాళ్లు చేయలేదు. ఎందుకు జరగదో చూపిస్తామనే పట్టుదలతో వారితో ఒకేరోజు రాష్ట్రంలో పెన్షన్లు అందిస్తున్నాం. అవసరమైతే వాలంటీర్ల సహాయం తీసుకోవాలని చెప్పాం' అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Next Story