'కూలీ' అనే పదం వాడొద్దు, అది బ్రిటిష్ నుంచి వచ్చింది: డిప్యూటీ సీఎం పవన్
ఉపాధి హామీ పథకంలో కూలీ అనే పదానికి బదులుగా శ్రామికుడు అనే పదాన్ని వాడాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు.
By Knakam Karthik
'కూలీ' అనే పదం వాడొద్దు, అది బ్రిటిష్ నుంచి వచ్చింది: డిప్యూటీ సీఎం పవన్
ఉపాధి హామీ పథకంలో కూలీ అనే పదానికి బదులుగా శ్రామికుడు అనే పదాన్ని వాడాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. మంగళగిరిలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం వేడుకల్లో పవన్ కల్యాణ్ పాల్గొని మాట్లాడారు. గ్రామాలే స్వయం ప్రతిపత్తి కలిగిన పంచాయతీలుగా ఉండాలి. పల్లెలు అభివృద్ధి చాలా కీలకం. ఇష్టంతోనే పంచాయతీ రాజ్ శాఖను తీసుకున్నా. నాకు పరిపాలన అనుభవం లేదు కానీ పని చేయాలనే చిత్తశుద్ధి ఉంది..అని పవన్ కల్యాణ్ అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1121 కోట్లు నేరుగా పంచాయతీలకు విడుదల చేశాం. అధికారులు లేకపోతే ఇంత వేగంగా అభవృద్ధి పనులు జరిగేవి కాదు. నిధులు విడుదలలో జాప్యం జరిగినా కూడా కూటమి ప్రభుత్వంపై నమ్మకంతొ కాంట్రాక్టర్లు పనులు చేశారు. చిన్న పైరవీ లేకుండా పనులు జరగాలని నేను నా క్యాంప్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం. కొందరు కేబినెట్ మంత్రులు చేసిన సిఫార్సులను సైతం వారికి వివరించి అర్హులైన వారికి చేశాం..అని డిప్యూటీ సీఎం చెప్పారు.
అడవితల్లి బాటలో భాగంగా రూ.1001 కోట్లతో సుమారు వెయ్యి కిలోమీటర్ల నిర్మించాం. 9 నెలల కాలంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ 24వ స్థానం నుంచి 2వ స్థానానికి వచ్చింది. చిత్తశుద్ధితో పని చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయి. గ్రామ పంచాయతీలు ఆర్థిక బలోపేతం స్థానిక ప్రభుత్వాలుగా మారాలి. పంచాయతీలపై ఆడిట్ జరగాలి. పంచాయతీలో ఉన్న భూమి, భవనాలపై ఆడిట్ చేయాలి. ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత స్థూపాలు, ప్రాంగణాలు ఏర్పాటు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో నేను మాట్లాడతా..దాని కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి..అని డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు.