జవాన్ కుటుంబానికి ఏపీ డిప్యూటీ సీఎం రూ.25 లక్షల సాయం

వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వ్యక్తిగతంగా రూ.25 లక్షలు ఇస్తున్నట్లు పవన్ ప్రకటించారు.

By Knakam Karthik
Published on : 11 May 2025 9:14 AM

Andrapradesh News, Murali Nayak, Ex-gratia, Pawan Kalyan, India-Pakistan Tension

జవాన్ కుటుంబానికి ఏపీ డిప్యూటీ సీఎం రూ.25 లక్షల సాయం

పాకిస్థాన్ కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వ్యక్తిగతంగా రూ.25 లక్షలు ఇస్తున్నట్లు పవన్ ప్రకటించారు. ఆదివారం పవన్ కల్యాణ్ శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు వెళ్లి మురళీనాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు. శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వీర జవాన్ మురళీనాయక్ కుటుంబానికి వ్యక్తిగతంగా రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తానని ప్రకటించారు. మురళీనాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.

మన దేశంలో ఎవరూ యుద్ధం కోరుకోలేదన్నారు. మన దేశాన్ని రక్షించుకునే క్రమంలో మురళినాయక్​ మరణించాడని అన్నారు. యుద్ధం రావడానికి పాకిస్తానే కారణం అన్నారు. వారం కిందట పాకిస్తాన్ ​ఆర్మీ జనరల్ ​ఉగ్రవాదులను ప్రేరేపించే విధంగా మాట్టాడారని గుర్తు చేశారు. నాలుగు యుద్ధాలు చేసినా వారికి దాహం తీరలేదన్నారు. నిన్న సీజ్ ​ఫైర్​అన్న తర్వాత కూడా మళ్లీ బాంబుల దాడి చేశారని అన్నారు. టెర్రరిస్టులకు బలమైన గుణపాఠం చెప్పాలని ప్రజలంతా కోరుకున్నారని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీకి, రక్షణ రంగానికి అండగా ప్రజలు నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు.

Next Story