అర్హులకు పెన్షన్లు ఇచ్చే బాధ్యత వారిదే: ఏపీ సీఎస్
అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందాలని, అర్హత ఉన్నా అందకపోతే కలెక్టర్లదే బాధ్యత అని చీఫ్ సెక్రటరీ విజయానంద్ స్పష్టం చేశారు.
By అంజి
అర్హులకు పెన్షన్లు ఇచ్చే బాధ్యత వారిదే: ఏపీ సీఎస్
అమరావతి: అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందాలని, అర్హత ఉన్నా అందకపోతే కలెక్టర్లదే బాధ్యత అని చీఫ్ సెక్రటరీ విజయానంద్ స్పష్టం చేశారు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొనాలని ఆదేశించారు. పెన్షన్ల అర్హతపై లక్షా 35 వేల మందికి నోటీసులు ఇచ్చామని, నెల రోజుల్లో ఎంపీడీవోలకు అప్పీల్ చేసుకోవాలని వారికి సూచించినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 88,319 మంది అప్పీల్ చేసుకున్నారని వెల్లడించారు.
రాష్ట్రంలో అర్హతగల ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ఫించన్ అందించాలని ఎక్కడైనా అర్హత ఉండి ఫించన్ రాలేదని ఫిర్యాదు వస్తే అందుకు సంబంధిత జిల్లా కలక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, భుగర్భ జలాలు, పీఎం కుసుమ్ పధకానికి భూ సంబంధిత అంశాలు, పింఛన్లు, జిల్లా జువెనైల్ జస్టీస్ కమిటీల ఏర్పాటు వాటి అమలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధిత అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.
ముందుగా పింఛన్లు పంపిణీపై సిఎస్ మాట్లాడుతూ.. అర్హత గల ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పెన్షన్ అందేలా చూడాలని కలెక్టర్లుకు స్పష్టం చేశారు. ప్రతినెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా,మండల ప్రత్యేక అధికారులు తప్పక పాల్గొనాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని అర్హత గలవారందరికీ తప్పనిసరిగా ఫించన్ అందేలా చూడలాని అర్హత ఉన్నా ఫించన్ రాలేదని మీడియా, సోషల్ మీడియా లేదా మరే ఇతర మార్గాల్లోనైనా ఫిర్యాదులు వస్తే అందుకు ఆయా జిల్లా కలక్టర్లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని సిఎస్ విజయానంద్ పునరుద్ఘాటించారు.
పెన్షన్ల తనిఖీకి సంబంధించి లక్షా 35 వేల మందికి నోటీసులు జారీ చేసి నెలరోజుల్లోగా ఎంపిడిఓలకు అప్పీళ్లు చేసుకోవాలని తెలియజేయాగా వారిలో 88వేల 319 మంది ఎంపిడిఓలకు అప్పీలు చేసుకోగా ఇంకా 23వేల మంది అప్పీలు చేసుకోలేదని నెలరోజుల గడువులోపు అప్పీళ్ళన్నీ పరిష్కరించాలని కలక్టర్లను సిఎస్ ఆదేశించారు. పెన్షన్ల పంపిణీపై ఎక్కడా నెగిటివ్ ప్రసారం రాకుండా చూసుకోవాలని అర్హతగల వారందరికీ తప్పనిసరిగా ఫెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అంతకు ముందు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, భూగర్భ జలాల పెంపు,పియం కుసుమ్ ఫధకానికి సంబంధించి భూసంబంధిత అంశాలు,జిల్లా జువనైల్ జస్టీస్ కమిటీలు ఏర్పాటు,యూరియా లభ్యత తదితర అంశాలపై కలక్టర్లతో సిఎస్ సమీక్షించారు.