ఏపీలో ఈరోజు ఎన్ని క‌రోనా కేసులంటే..?

AP Corona Update Today.ఆంధ్రప్రదేశ్‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో 50,027 కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 227 పాజిటివ్.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 10 Jan 2021 7:10 PM IST

AP Corona update

ఆంధ్రప్రదేశ్‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో 50,027 కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 227 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,84,916కి చేరింది. నిన్న 289 మంది బాధితులు కోలుకోగా.. మొత్తంగా 8,75,243 మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌టప‌డ్డారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 2,544 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మ‌రణాల సంఖ్య 7,129కి చేరింది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1,23,24,674 క‌రోనా శాంపిల్స్‌ని ప‌రీక్షించారు.


Next Story