ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 29,714 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 128 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. దీంతో ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,83,210 కు చేరింది. ఇందులో 8,73,149 లక్షల మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,943 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,118 మంది మృతి చెందారు.

అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 21 కేసులు న‌మోదు అయ్యాయి. తూర్పు గోదావరిలో 19, కృష్ణా జిల్లాలో 15, గుంటూరు జిల్లాలో 15, కర్నూలు జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.
తోట‌ వంశీ కుమార్‌

Next Story