సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను విడుద‌ల చేసిన సీఎం

AP CM YS Jagan Releases welfare schemes calendar. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం 13వ రోజు కొనసాగాయి. అయితే ఈ సమావేశాలు నేటితో ముగియనున్నాయి.

By Medi Samrat  Published on  25 March 2022 10:31 AM GMT
సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను విడుద‌ల చేసిన సీఎం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం 13వ రోజు కొనసాగాయి. అయితే ఈ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. 2022-23 సంవత్సరానికి రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టామన్నారు. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు కేటాయించామన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో బడ్జెట్‌పై ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. కరోనా విజృంభిస్తున్నప్పటికీ గత మూడేళ్లలో 95 శాతం హామీలను నెరవేర్చామన్నారు.

పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల వారిని ఆదుకునేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గతంలో టీడీపీకి ఓట్లు వేసిన వారే.. ఇప్పుడు మనతో ఉన్నారని, అందుకే ప్రతిపక్షాలు ఉనికి కోసం ప్రయత్నిస్తున్నాయని అన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలు గుర్తిస్తున్నారని.. చంద్రబాబు ఒక్క మంచి పని కూడా చేయలేదని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. కాగా, 2022-23 సంవత్సరానికి సంబంధించిన సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు.

ఏప్రిల్ - జగనన్న వసతి దీవెన, వడ్డీ లేని రుణాలు

మే- జగనన్న విద్యా దీవెన, రైతు భరోసా, ఖరీఫ్ బీమా, మత్స్యకార భరోసా.

జూన్ - అమ్మ ఒడి

జూలై - జగనన్న విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం, జగనన్న తోడు

ఆగస్టు - జగనన్న విద్యా దీవెన, నేతన్న నేస్తం, MSMEలకు ప్రోత్సాహకాలు

అక్టోబర్ - వసతి దీవెన, రైతు భరోసా రెండవ విడత

నవంబర్ - జగనన్న విద్యా దీవెన, వడ్డీ లేని రుణాలు

డిసెంబర్ - ఈబీసీ నేస్తం, లా నేస్తం

జనవరి 2023 - రైతు భరోసా 3వ విడత, వైఎస్ఆర్ ఆసరా, పింఛన్లు 2500 నుండి 2750కి పెంపుదల

ఫిబ్రవరి - జగనన్న విద్యా దీవెన, జగన్నాథ చేదోడు

మార్చి - జగనన్న వసతి దీవెన









































Next Story