సీఎం జగన్ మంచి మనసు.. ఇద్దరు బాలుర చికిత్సకు సాయం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నాడు ఇద్దరు వ్యక్తుల కష్టాలపై స్పందించి వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించి
By అంజి Published on 3 Jun 2023 8:00 AM ISTసీఎం జగన్ మంచి మనసు.. ఇద్దరు బాలుర చికిత్సకు సాయం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం నాడు ఇద్దరు వ్యక్తుల కష్టాలపై స్పందించి వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించి తక్షణమే ఆర్థిక సహాయం కింద ఒక్కొక్కరికి లక్ష రూపాయలు అందించాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. నిన్న గుంటూరులో వైఎస్ఆర్ యంత్ర సేవా పధకం రెండో దశను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తుల కుటుంబాలను సీఎం కలిసి.. వారిని ఆదుకోవాలని అధికారులకు సూచించారు.
ఆ వెంటనే గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, అసిస్టెంట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, డీఆర్‌వో చంద్రశేఖర, డిప్యూటీ కలెక్టర్ వెంకట శివరామి, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రథంశెట్టి సీతారామాంజనేయులు.. తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఫరూక్ అలీకి, ఖాదర్ బాషాకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చెక్కును అందించారు. గుంటూరు నగరం శ్రీనివాసరావుపేటకు చెందిన 14 ఏళ్ల ఫరూక్ అలీ, 15 ఏళ్ల ఖాదర్ బాషాల తల్లిదండ్రులు సీఎంను కలిశారని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు.
ఫరూక్ అలీ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. థైరాయిడ్, కాలేయ సమస్యలతో బాధపడుతున్నాడు. ప్రభుత్వం అతనికి చికిత్సతో పాటు నెలవారీ 10,000 రూపాయల తలసేమియా పెన్షన్‌ను అందిస్తుంది. ఇక ఖాదర్ బాషా (15) పుట్టుకతోనే మానసిక వికలాంగుడు. ప్రభుత్వం అతనికి నెలకు రూ.3వేలు పింఛను ఇస్తుందన్నారు. ఖాదర్ బాషా వైద్య పింఛన్ పొందేందుకు గల అర్హతలను పరిశీలించి సహాయం అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. పూర్తి వైద్య సహాయం ప్రభుత్వ ఖర్చుతో అందజేస్తామని తెలిపారు.