అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బుధవారం నిర్వహించిన జగనన్న విద్యా దీవెన పథకం నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు . విద్యార్థుల తల్లుల ఖాతాల్లో దాదాపు రూ.694 కోట్లు జమ అయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు అని అన్నారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే దివంగత నేత వైఎస్‌ఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చారన్నారు.
ప్రభుత్వాలు ఈ పథకాన్ని విస్మరించాయని సీఎం జగన్ అన్నారు. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు చూసి అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న విద్యా దీవెన కింద పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. విద్యా దీవెనతో పాటు జగనన్నకు వసతి దీవెన ఇస్తున్నామని, విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకొచ్చి పేదలకు విద్యను హక్కుగా తీర్చిదిద్దుతున్నామని ఆయన పేర్కొన్నారు.
జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి 11.02 లక్షల మంది విద్యార్థులకు రూ.684 కోట్లను తల్లుల ఖాతాల్లో జమచేస్తున్నామని, పిల్లల చదువుకు అయ్యే ఖర్చును ఖర్చుగా పరిగణించడం లేదని, దానిని ఆస్తిగా పరిగణిస్తున్నామని చెప్పారు. మీ పిల్లలను పూర్తిగా చదివించడం తన బాధ్యత అని చెప్పిన వైఎస్ జగన్.. వీలైనంత ఎక్కువ మంది పిల్లలకు సహకరిస్తానని చెప్పారు.