ఏపీ సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఖ‌రారైంది. ఈ రోజు ఉద‌యం 11 గంటలకు ఆయ‌న ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళతారు. మధ్యాహ్నం 2.15 గంటలకు ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికార నివాసం 1-జన్‌పథ్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత వరుసగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. రాత్రి 9 గంటలకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్ట్‌కు సంబందించిన నిధులు, విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీలు త‌దిత‌ర విష‌యాల‌పై షాతో చర్చిస్తారు.

నిజానికి సీఎం జ‌గ‌న్ సోమవారమే ఢిల్లీకి వెళ్లాల్సింది. అయితే.. అమిత్ షా అపాయింట్‌మెంట్ కు స‌మ‌యం లేక‌పోవ‌డంతో ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. తన బెయిలు రద్దు పిటిషన్‌పై ఈనెల 14న తదుపరి విచారణ జరగనుండటం, ఎంపీ రఘురామరాజు అరెస్టు, సీఐడీ కస్టడీలో గాయాలపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో సీఎం ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈరోజు రాత్రికి ఢిల్లీలోనే ఉండి రేపు మ‌ధ్యాహ్నానికి సీఎం జ‌గ‌న్ తిరిగి అమ‌రావ‌తి చేరుకుంటారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story