రైతు భరోసా కేంద్రాలను పౌరసరఫరాల శాఖతో అనుసంధానం చేసే అంశంపై సీఎం వైఎస్ జగన్ ఇవాళ సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. రైతు భరోసా కేంద్రాల పని తీరు సమర్థవంతంగా కొనసాగడానికి లైన్ డిపార్ట్‌మెంట్లతో మంచి సమన్వయం ఉండాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఇందుకు గైడింగ్ ప్లాన్‌ను రూపొందించుకోవాలని తెలిపారు.
క్రమం తప్పకుండా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు సాయిల్ కార్డులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. సాయిల్ రికార్డులతో పాటు ఆ భూమికి ఎంత మోతాదులో ఎరువులు వేయ్యాలి, ఎలాంటి పంటలు వేయాలన్న దానిపై సలహాలు, సూచనలు అందించాలన్నారు. ఖరీఫ్ పంటల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. కనసీ మద్దతు ధర కన్నా, ఒక్క పైసా కూడా తగ్గకూడదన్నారు. అలాగే రైతులకు ఎంఎస్‌పీ ధర అందాలని, ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు.