ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను ప్ర‌తిష్టాత్మ‌మైన స్కోచ్ అవార్డు వ‌రించింది. దేశంలోనే అత్యుత్త‌మ ముఖ్య‌మంత్రిగా మెరుగైన ప‌నితీరు క‌న‌బ‌రిచినందుకు వైఎస్ జ‌గ‌న్‌కు స్కోచ్ అవార్డుకు ఎంపిక చేశారు. మంగ‌ళ‌వారం స్కోచ్ గ్రూప్ సంస్థ‌ల అధినేత స‌మీర్ కొచ్చ‌ర్ తాడేప‌ల్లి సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌గ‌న్‌కు క‌లిసారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌కు 'సీఎం ఆఫ్ ద ఇయ‌ర్' గా జ‌గ‌న్‌కు స్కోచ్ అవార్డు ప్ర‌ధానం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాలనలో విప్లవాత్మక మార్పులతో పారదర్శకతకు పెద్దపీట వేసిందని స్కోచ్‌ గ్రూప్‌ దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో చేపట్టిన 123 ప్రాజెక్టులపై ఏడాది పొడవునా జరిగిన అధ్యయనంలో పాలనలో ఉత్తమ ప్రతిభ కనపరిచినట్లు తేలిందని స్కోచ్‌ గ్రూప్‌ చైర్మన్‌ సమీర్‌ కొచ్చర్‌ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, దిశ చట్టం, వైఎస్సార్ చేయూత వంటి పథకాలను పరిగణనలోకి తీసుకుని సీఎం జగన్ ను అవార్డుకు ఎంపిక చేసినట్టు స్కోచ్ గ్రూప్ వెల్లడించింది. కరోనా వ్యాప్తి చెందుతున్న కాలంలోనూ 123 పథకాలను అమలు చేయడమే కాకుండా, కొన్ని సాహసోపేత నిర్ణయాలతో సీఎం పదవికి వన్నె తెచ్చారన్నారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story