రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో. సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముచ్చింతల్‌ను సందర్శించనున్నారు. త్రిదండి చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో నిర్వహించే పూజా కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొంటారు. ఇవాళ ఆరో రోజు రామానుజ సహస్రాబ్ది వేడుకలు నిర్వహిస్తారు. దృష్టి దోష నివారణకు వైయ్యూహి కేష్టి యాగం, వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ జీవనానికి శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ, అలాగే ప్రముఖులచే ప్రవచనాలు, విశేషమైన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
మధ్యాహ్నం 3.50 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుండి హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకున్న తర్వాత.. అక్కడి నుండి నేరుగా ముచ్చింతల్‌లోని త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమాని వెళ్లి సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 7.30 గంటల వరకు సీఎం జగన్ అక్కడే ఉండనున్నారు. తిరిగి రాత్రి 8 గంటలకు సీఎం జగన్ తాడేపల్లికి బయల్దేరనున్నారు. రాత్రి 9.05 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీస్‌కి చేరుకున్నారు. ఇటీవల 216 అడుగుల ఎత్తైన శ్రీ రామానుజుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.