అమరావతి: రాష్ట్ర రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో సీఎం చంద్రబాబు నేడు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. పీఎం కిసాన్ నిధులు రూ.2 వేలతో కలిపి మొత్తం రూ.7 వేలను ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకంపై సందేహాల నివృత్తికి 155251 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది.
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాతా సుఖీభవ పథఖాన్ని అమలు చేయడానికి సిద్ధహూంది. ఈ పథకం కింద కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ నిధులు కలిపి అర్హత గల ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20 వేలను మూడు విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఇక రెండో విడతలో మరో రూ.7 వేలు, మూడో విడతలో రూ.6 వేలు జమ చేయనుంది. అటు కౌలు రైతులను గుర్తించి, వారికి గుర్తింపుకార్డులను పంపిణీ చేయనున్నారు. కార్డుల పంపిణీ పూర్తి అయ్యాక ఒకేసారి వారికి రెండు విడతల సాయం రూ.14 వేలను వారి ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.