ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ మరోసారి వాయిదా పడింది. గురువారం జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఏపీ సీఎంఓ ప్రకటించింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుందని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారనే ప్రచారం జరిగింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రివర్గం ప్రధానంగా చర్చించబోతోందని.. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటూ.. కరోనా కట్టడి కోసం మరికొన్ని కీలక నిర్ణయాలను మంత్రి వర్గ సమావేశం తీసుకునే అవకాశముందనే వార్తలు వినిపించగా తాజాగా క్యాబినెట్ భేటీ మరోసారి వాయిదా పడింది.

మే 4వ తేదీన సచివాలయంలోని 1న బ్లాక్ కేబినెట్ మీటింగ్ హాల్లో సమావేశం జరుగుతుందని సీఎంఓ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ మీటింగ్ రెండోసారి వాయిదా పడింది. తొలుత ఈనెల 22 మంత్రి మండలి సమావేశ‌ ముంటుందని అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత సమావేశాన్ని ఈరోజుకి వాయిదా వేశారు. కానీ మరోసారి వాయిదా పడింది. సమావేశం వాయిదా పడటానికి కారణాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story