అమెరికా అమ్మాయి.. రాజాం అబ్బాయి

AP boy marries US girl in Rajam.ప్రేమ‌.. ఎప్పుడు ఎవ్వ‌రి మ‌ధ్య పుడుతుందో ఎవ్వ‌రికి తెలియ‌దు. ప్రేమ‌కి కులం,

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jun 2022 3:50 PM IST
అమెరికా అమ్మాయి.. రాజాం అబ్బాయి

ప్రేమ‌.. ఎప్పుడు ఎవ్వ‌రి మ‌ధ్య పుడుతుందో ఎవ్వ‌రికి తెలియ‌దు. ప్రేమ‌కి కులం, మ‌తం, జాతి అనే వ్య‌త్యాసాలు ఉండ‌వు. ప్రేమ‌కు దేశ స‌రిహ‌ద్దులు కూడా అడ్డురావ‌ని అంటుంటారు. స‌రిగ్గా అలాంటి ఓ ప్రేమ జంట వివాహ‌బంధంతో ఒక్క‌టైంది.

రాజాం పట్టణంలోని కూరాకులవీధికి చెందిన కందుల కిరణ్‌ బీటెక్‌ పూర్తి చేసి ఎంఎస్‌ చదివేందుకు అమెరికాలోని ఓహియో రాష్ట్రానికి వెళ్లాడు. అక్కడే బీబీఏ చదువుతున్న మోర్గాన్‌ బ్రింక్‌ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. చదువులయ్యాక మిచిగాన్‌ రాష్ట్రంలో వేర్వేరు కంపెనీల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇక పెళ్లి చేసుకోవాలని అనుకుని ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. తొలుత అమ్మాయి తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపినప్పటికీ కొన్నాళ్ల తరువాత ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు. ముందుగా అమెరికాలో వారి సంప్రదాయం ప్రకారం ఆ ప్రేమ జంట వివాహం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో హిందూ సంప్రదాయంలో పెళ్లి జరిగింది.

భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవాలన్నది వధువు కోరిక. దీంతో రాజాం పట్టణంలో వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కోవిడ్‌ కారణంగా రెండేళ్లపాటు వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. ఇన్నాళ్లకు ముహూర్తం ఖరారు చేసుకుని రాజాంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు టీనా బ్రింక్, ఎరిక్‌ బ్రింక్ లు హాజరవ్వగా.. అబ్బాయి తరపున బంధు మిత్రులు, కుటుంబసభ్యులు హాజరయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి మహిగా పేరు మార్చుకోవడం విశేషం.

Next Story