'మా జెండాలు పీకుతారా?'.. అధికారులపై సోము వీర్రాజు ఆగ్రహం

AP BJP Chief Somu veerraju fires on visakha officials. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. నగరంలోని సిరిపురం

By అంజి  Published on  11 Nov 2022 1:51 PM GMT
మా జెండాలు పీకుతారా?.. అధికారులపై సోము వీర్రాజు ఆగ్రహం

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. నగరంలోని సిరిపురం జంక్షన్‌ ద్రోణం రాజు సర్కిల్‌ వద్ద టౌన్ ప్లానింగ్ అధికారులు బీజేపీ జెండాలు తొలగించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన జెండాలను ఎలా తొలగిస్తారని, అసలు ఎందుకు తొలగిస్తున్నారని అధికారులను సోము వీర్రాజు ప్రశ్నించారు. దీంతో అధికారులు ఆన్సర్‌ చెప్పకపోవడంతో సోము ఫైర్‌ అయ్యారు. ఈ సందర్భంగా అధికారులు, సోము వీర్రాజు మధ్య వాగ్వాదం నెలకొంది.

మీకు ఇష్టానుసారం జెండాలు పీకేస్తారా అంటూ సోము వీర్రాజు ఫైర్‌ అయ్యారు. ''ఈ విషయం కమిషనర్‌తో మాట్లాడతాను.. మేం కట్టిన జెండాలు ఒక్క రోజు కూడా ఉంచరా?'' అంటూ సోము మండిపడ్డారు. అధికారులు జెండాలను పీకేసి పికప్ ట్రక్‌లో వేయగా.. వాటిని సోము వీర్రాజు మళ్లీ బయటికి తీశారు. ''మాది నేషనల్ పార్టీ... ఇవాళ ప్రధానమంత్రి వస్తున్నారు... జెండాలు ఎందుకు తీసేస్తున్నారు.. మా జెండాలు రెండ్రోజులు ఉంచడానికి మీకు అంత కష్టమైపోయిందా?'' అని అధికారులపై ఆయన తీవ్ర స్వరంతో మాట్లాడారు.


Next Story