ఈ నెల 20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!

AP Assembly Sessions Starts From May 20. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ నెల 20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.

By Medi Samrat  Published on  12 May 2021 8:08 AM GMT
AP assembly sessions

అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ నెల 20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు నేటి సాయంత్రానికి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మావేశాల్లోనే 2021-22కు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ ద‌ఫా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో బీఏసీ భేటీలో నిర్ణయించ‌నున్నారు. స‌మావేశాల తొలి రోజున‌ గవర్నర్ ప్రసంగము ఉంటుంది. అనంతరం గ‌వ‌ర్న‌ర్‌ ప్రసంగానికి ఉభయ సభలు ధన్యవాదాలు తెలపనున్నాయి. ఒక తొలిరోజు అసెంబ్లీలో బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, మండలిలో చల్లా రామకృష్ణ రెడ్డిలకు స‌భ్యులు సంతాపం ప్రకటించనున్నారు.


Next Story
Share it