ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు మూహూర్తం ఖారారైంది. ఈ నెల 19 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 5 రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నదద్దమవుతోంది. ఈ నెల18న రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆ తరువాతి రోజు అంటే జూలై19 నుంచి అసెంబ్లీ సమావేశాలను చేపట్టనున్నారు. 23వ తేదీ వరకు సమావేశాలు కొసాగే అవకాశం ఉంది.
ఈనెల 18న సాయంత్రం లేదా 19న ఉదయం అసెంబ్లీ బీఏసీ సమావేశాలు నిర్వహించి ఎంజెండాను ఖరారు చేసే అవకాశముంది. సమావేశాల్లో ముఖ్యంగా ప్రభుత్వం ఈ మూడేళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రజలకు చేకూర్చిన లబ్ధి, ఇతర అంశాలపై చర్చించే అవకాశముంది. అలాగే 10 నుంచి 12 బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీఏసీ సమావేశాలు జరిగే రోజునే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.