ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు
Another Two Omicron Cases Confirmed in AP.దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శర వేగంగా వ్యాపిస్తోంది.
By తోట వంశీ కుమార్ Published on 26 Dec 2021 9:04 AM ISTదేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శర వేగంగా వ్యాపిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదులు అయ్యాయి. ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఒక్కో కేసు బయటపడగా.. వారి కుటుంబ సభ్యులకు నెగెటివ్ వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరుకుంది.
48 ఏళ్ల ఓ వ్యక్తి ఈ నెల 16న దక్షిణాఫ్రికా నుంచి విమానంలో హైదరాబాద్ కు వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రకాశం జిల్లాకు చేరుకున్నారు. ఈ నెల 19న ఆయనకు ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయగా.. కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ వ్యక్తి శాంపిల్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. మరో కేసులో.. అనంతపురం జిల్లాకు చెందిన 33ఏళ్ల వ్యక్తి ఈ నెల 18న యూకే నుంచి విమానంలో బెంగళూరు వచ్చారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం చేరుకున్నారు. అతడికి ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేయగా.. కరోనా నిర్థరాణ అయ్యింది. అతడి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌గా నిర్థారణ అయినట్లు ఏపీ వైధ్యాధికారులు వెల్లడించారు. ఈ ఇద్దరిని క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రెండు కేసులో కలిపి రాష్ట్రంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకి చేరింది.