తిరుమలలో మరోసారి చిరుత కలకలం
తిరుమలలో అలిపిరి నడకమార్గంలో చిరుత పులి కనిపించింది. దీంతో నడక దారి భక్తుల్లో భయం, ఆందోళన మొదలైంది.
By అంజి
తిరుమలలో మరోసారి చిరుత కలకలం
తిరుమలలో అలిపిరి నడకమార్గంలో చిరుత పులి కనిపించింది. దీంతో నడక దారి భక్తుల్లో భయం, ఆందోళన మొదలైంది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తున్నట్టు తెలియడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలోని పాదచారుల మార్గంలో చిరుతపులి సంచరించడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అప్రమత్తమయ్యారు. వారం రోజుల కిందట కూడా ఇదే ప్రాంతంలో చిరుతపులి కనిపించింది. ఈ క్రమంలోనే అలిపిరి-తిరుమల నడకదారిలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా మాత్రమే నడవాలని టీటీడీ అధికారులు సూచించారు.
చిరుతల సంచారం పెరగడంతో కాలినడకన వెళ్లే భక్తులకు తక్షణ రక్షణ చర్యగా టీటీడీ సిబ్బంది ఊతకర్రలను అందిస్తున్నారు. మరోవైపు చిరుతను ట్రేస్ చేసి పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. టీటీడీ భక్తుల రక్షణ కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. నడకమార్గంలో రాత్రి 10 గంటల తర్వాత ఎవరినీ అనుమతించడం లేదు.. ఉదయం ఆరు తర్వాతే అనుమతిస్తారు. అంతేకాదు 12 ఏళ్లలోపు పిల్లల్ని నడక మార్గంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనుమతి లేదు.