తల్లికి అస్వస్థత.. కేబినెట్ భేటీ నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు పవన్ పయనం.?
అయితే ఈ సమావేశానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.
By Knakam Karthik
తల్లికి అస్వస్థత..కేబినెట్ భేటీ నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు పవన్ పయనం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సెక్రటేరియట్‌లో కేబినెట్ సమావేశం కాసేపటి కింద ప్రారంభమైంది. అయితే ఈ సమావేశానికి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆయన తల్లి అంజనా దేవీ అస్వస్థతకు గురయ్యారంటూ కుటుంబ సభ్యులు ఫోన్ చేసి తెలిపారు. దీంతో పవన్ కల్యాణ్ కేబినెట్ సమావేశం నుంచి సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చి.. హుటాహుటిన కేబినెట్ సమావేశం జరుగుతుండగానే హైదరాబాద్ బయలుదేరారు. అయితే ఈ వార్త తప్పు అని తెలుస్తుంది.
తల్లి అంజనాదేవీ అనారోగ్యానికి గురయ్యారని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారని వార్తలు రావడంతో అభిమానులు, శ్రేయోభిలాషులలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో, ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు ఈ అంశంపై స్పందించారు. తన తల్లి అనారోగ్యంపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.
ఈ మేరకు నాగబాబు ఎక్స్‌లో ఇలా రాసుకొచ్చారు.. "మా అమ్మ అంజనాదేవి గారి ఆరోగ్యం చాలా బాగుంది. ఆమె అనారోగ్యంతో ఉన్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వదంతులను నమ్మవద్దు" అని నాగబాబు తన పోస్టులో పేర్కొన్నారు. ఆరోగ్యం విషయంలో నిర్ధారించుకోకుండా వార్తలు ప్రచారం చేయవద్దని పలువురు నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.