ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు మంగళగిరిలో నిర్వహించిన మన ఇల్లు, మన లోకేశ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మంగళగిరి ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు లోకేశ్ చెప్పారు. సూపర్ సిక్స్ హామీలతో పాటు మంగళగిరి ప్రజలను తాను ప్రత్యేకంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఏప్రిల్ 13వ తేదీన వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి, వచ్చే ఏడాది సరిగ్గా అదే తేదీన హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.
జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు మనల్ని మార్చివేస్తాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 2019లో నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయాను అన్నారు. నేను వచ్చిన 20 రోజుల్న్నికలు జరిగాయి అని తెలిపారు. 5300.ఓట్ల తేడాతో ఆనాడు నేను ఓడిపోయాను.. ఆరోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచిందన్నారు. ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మంగళగిరి ప్రజల కోసం పనిచేశారు అన్నారు.